శివయ్యగారి మనవరాలి కథ | shivayya gari grand daughter story | Sakshi
Sakshi News home page

శివయ్యగారి మనవరాలి కథ

Published Sat, Jan 25 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM

శివయ్యగారి మనవరాలి కథ

శివయ్యగారి మనవరాలి కథ

 ఓ తాత, మనవరాలి అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘శివయ్యగారి మనవరాలు’. శ్రీ జ్యోతిలింగేశ్వర ఫిలింస్‌పై రంగనాథ్ ముఖ్యపాత్రలో సూర్య, సానియా జంటగా  ఎస్.కె. మస్తాన్ నిర్మిస్తున్నారు. తలారి నాగరాజు దర్శకుడు. ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. వైజాగ్, విజయనగరంలో రెండో షెడ్యూల్ జరపనున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘తాతా మనవరాలి అనుబంధం అందరినీ హత్తుకునే విధంగా ఉంటుంది.
 
  కుటుంబ విలువలున్న సినిమా ఇది. మంచి సందేశంతో పాటు వాణిజ్య అంశాలు మెండుగా ఉన్నాయి.  సదివే దేవేంద్ర మంచి స్వరాలిచ్చారు. పాటలనే కేరళలో చిత్రీకరిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: కార్తీక్ శర్మ, కథ-నిర్మాత: ఎస్.కె. మస్తాన్.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement