ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతోంది.. నిర్విరామంగా మరణ మృదంగం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 12,881 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 334 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,66,946కు చేరగా.. ఇప్పటివరకు 12,237 మంది కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 1,60,384గా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,94,325 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు. ( ఇది.. ఆ దగ్గేనా? )
కాగా, బుధవారం ఒక్కరోజే 2003మంది మృత్యువాత పడ్డారు. మహారాష్ట్ర, ఢిల్లీలో ఇటీవలే సంభవించిన కొన్ని మరణాలకు కరోనా వైరస్ కారణమని తేలడంతో వాటిని కూడా ఈ జాబితాలో చేర్చారు. దేశ వ్యాప్తంగా జూన్ 17వ తారీఖు వరకు మొత్తం 62.4 లక్షల శాంపిల్స్‌ను టెస్ట్ చేసినట్లు ఐసీఎమ్‌ఆర్ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 1,65,412 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment