![లాలూ పుట్టినరోజు వేడుకల్లో సీఎం నితీష్](/styles/webp/s3/article_images/2017/09/4/41465622600_625x300.jpg.webp?itok=7s_-93QU)
లాలూ పుట్టినరోజు వేడుకల్లో సీఎం నితీష్
పట్నా: ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఘనంగా తన 69వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. శనివారం ఉదయం ఆయన తన కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా లాలూ సతీమణి రబ్రీదేవి... లాలూకు పుష్పగుచ్ఛం ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ రోజు ఉదయం లాలూ నివాసానికి చేరుకుని లాలూకు స్వయంగా బర్త్డే విషెస్ తెలిపారు. అనంతరం లాలూ నివాసంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో నితీష్ పాల్గొన్నారు.