కేంద్ర మంత్రులకు టీ బీజేపీ నేతల విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చేయూతనివ్వాలని టీ బీజేపీ ప్రతినిధుల బృందం పలువురు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసింది. జాతీయ రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, స్మార్ట్‌సిటీల నిర్మాణం, ఉన్నత విద్య, వైద్య సంస్థల ఏర్పాటు, తాగు, సాగునీటికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఈ బృందం కోరింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ బండారు దత్తాత్రేయ, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, నేతలు విద్యాసాగర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, శ్రీరామ్ వెధిరె, చంద్రశేఖర్, రామచంద్రరావులతో కూడిన ప్రతినిధి బృందం బుధవారం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతీ ఇరానీ, వైద్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, జలవనరుల మంత్రి ఉమాభారతిలను వేర్వేరుగా కలిసి తెలంగాణ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలను అందజేసింది.
రాష్ట్రాభివృద్ధికి చేయూతనివ్వండి
Published Thu, Jul 3 2014 4:17 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement
Advertisement