సుజనా వైపే మొగ్గు చూపుతున్న చంద్రబాబు! | Cabinet expansion: chandrababu naidu lobbied hard for Sujana chowdary | Sakshi
Sakshi News home page

సుజనా వైపే మొగ్గు చూపుతున్న చంద్రబాబు!

Published Fri, Nov 7 2014 9:25 AM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM

సుజనా వైపే మొగ్గు చూపుతున్న చంద్రబాబు! - Sakshi

సుజనా వైపే మొగ్గు చూపుతున్న చంద్రబాబు!

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన టీడీపీకి చోటు దాదాపు ఖాయమైనట్లు సమాచారం.  తనకు అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరి వైపే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే మోదీ ప్రాధాన్యత మేరకు సుజనాకు అవకాశం లేదంటూ మరోవైపు ప్రచారం జరుగుతోంది.  బీసీ కోటాలో కొణకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్పకు, ఎస్సీ కోటాలో శివప్రసాద్కు అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ కోటాలో ఎంపీ మల్లారెడ్డి రేసులో ఉన్నారు.

ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ ఎకనామిక్ సమ్మిట్‌లో చంద్రబాబు మాట్లాడుతుండగానే ప్రధాని నుంచి ఫోన్ వచ్చింది. దీంతో ఆయన ఉన్నపళంగా పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడి వచ్చారు. దీనిపై సమ్మిట్‌లో ప్రతినిధులు చంద్రబాబును ప్రశ్నించగా 'రెండు రోజుల్లో మీకూ తెలుస్తుంది కదా..' అని ఆయన వ్యాఖ్యానించారు. మరోసారి ఇదే విషయాన్ని వారు ప్రస్తావించగా 'ఆయన (మోదీ) నా నుంచి సమాచారం కోరేందుకు ప్రయత్నిస్తుంటే నేనేమో ఆ సమాచారాన్ని దాచేందుకు ప్రయత్నిస్తున్నా' అంటూ చంద్రబాబు చమత్కరించటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement