కింగ్స్ సర్కిల్ స్టేషన్‌ను దత్తతివ్వండి.. | Citizens want to adopt King's Circle railway station | Sakshi
Sakshi News home page

కింగ్స్ సర్కిల్ స్టేషన్‌ను దత్తతివ్వండి..

Published Sun, Nov 9 2014 11:17 PM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

కింగ్స్ సర్కిల్ స్టేషన్‌ను దత్తతివ్వండి.. - Sakshi

కింగ్స్ సర్కిల్ స్టేషన్‌ను దత్తతివ్వండి..

సెంట్రల్ రైల్వేకు స్థానికుల వినతి
సాక్షి, ముంబై: హార్బర్‌లైన్ మార్గంలోని కింగ్స్ సర్కిల్ రైల్వేస్టేషన్‌ను దత్తత తీసుకొనేందుకుగాను సెంట్రల్ రైల్వేకు స్థానికులు   ఓ ప్రతిపాదనను సమర్పించారు. ఒకవేళ సెంట్రల్ రైల్వే ఇందుకు అంగీకరిస్తే ముంబై సబర్బన్ నెట్‌వర్క్‌లోనే నగర వాసులు దత్తత తీసుకున్న మొదటి స్టేషన్‌గా ఇది పేరు గాంచనుంది. రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న వారు ఈ స్టేషన్‌ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతామ, మౌలిక సదుపాయాల నిర్వహణ బాధ్యతలు చేపడతామని సెంట్రల్ రైల్వేకు ప్రతిపాదన సమర్పించారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు సమీపంలో నివాసముంటున్న గౌరంగ్ దమానీ మాట్లాడుతూ... ఈ స్టేషన్ పరిశుభ్రత విషయమై తాము జవాబుదారిగా ఉంటామని ఇందుకు అనుమతిని ఇవ్వాల్సిందిగా సెంట్రల్ రైల్వేకు ఓ లేఖ సమర్పించామన్నారు.
 
ఈ సందర్భంగా సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో నరేంద్ర పాటిల్ మాట్లాడుతూ.. స్థానికులు స్వచ్ఛందంగా రైల్వేస్టేషన్ దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారని, వారు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కోసం ఆశించడం లేదని తెలిపారు. తాము ఈ ప్రతిపాదనను పూర్తిగా అధ్యయనం చేశామని చెప్పారు. ఈ స్టేషన్‌ను ఎలవేటెడ్‌గా నిర్మించారు. అయితే ఈ స్టేషన్‌కు రెండు ద్వారాలు ఉన్నాయి. ఒకటి గాంధీ మార్కెట్ వద్ద ఉండగా, మరొకటి ఎస్‌ఐఈఎస్ పాఠశాల వద్ద ఉంది.  
 
రైల్వే ప్లాన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 50 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. అందులో ముంబై సెంట్రల్, ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ) కూడా ఉన్నాయి. ఇందుకు గాను రైల్వే బోర్డు ఇటీవల ప్రైవేట్ సంస్థలను కలిసి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యులుగా రైల్వే స్టేషన్లను నిర్వహించాలని చర్చించింది. అంతేకాకుండా ఒక్కో రైల్వే స్టేషన్‌కు గాను ఇండియన్ రైల్వే రూ.5 కోట్ల నుంచి 15 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు నిర్ణయించింది. రైల్వే స్టేషన్ల ఆవరణలు, రైల్వే ట్రాక్స్, మరుగుదొడ్లు, విశ్రాంతి, వెయిటింగ్ రూమ్స్‌తోపాటు బుకింగ్, కార్ పార్కింగ్‌లను కూడా పరిశుభ్రపర్చాలని ప్రైవేట్ కాంట్రాక్టర్లను రైల్వే కోరింది. ఇదిలా ఉండగా, రెండేళ్ల కిందట ప్రకటనల హక్కు కింద రైల్వే స్టేషన్లను దత్తత తీసుకోవాలని సెంట్రల్ రైల్వే అధికారులు ప్రైవేట్ సంస్థలను కోరారు. కానీ ఆ ప్రయోగం ఫలించలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement