సాక్షి, తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో కేరళ అతలాకుతలమవుతున్న నేపథ్యంలో.. సొంత నియోజకవర్గం వయనాడ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. వయనాడ్‌తోపాటు మలప్పురం వరదలతో తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో.. ఆయన దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మలప్పురంలోని భూదానం చర్చి సమీపంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని రాహుల్ పరిశీలించారు. బాధితులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. వరదలతో కేరళ అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో... రెండురోజలపాటు నియోజకవర్గంలోనే ఉండి పరిస్థితిని రాహుల్ సమీక్షించనున్నారు. వరద సాయం కోసం ఆయన ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment