'ఇంతకన్నా పెద్ద జోక్ లేదు' | Constitution's ideals, principles under threat says Sonia | Sakshi
Sakshi News home page

'ఇంతకన్నా పెద్ద జోక్ లేదు'

Published Thu, Nov 26 2015 3:05 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

'ఇంతకన్నా పెద్ద జోక్ లేదు' - Sakshi

'ఇంతకన్నా పెద్ద జోక్ లేదు'

ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. దేశంలో పెరుగుతున్న అసహనం మూలంగా రాజ్యాంగ భావాలు, సూత్రాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్డీయే పాలనలో రాజ్యాంగాన్ని అవమానపరచడం సాధారణంగా మారిందన్నారు.

 రాజ్యాంగం పట్ల గౌరవం లేనటువంటి, రాజ్యంగ రూపకల్పనలో పాలు పంచుకోనివారు ప్రస్తుతం రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఎన్నికైన అనంతరం దానిపైనే అభ్యంతరాలు తెలుపుతున్నారని విమర్శించారు. ఇప్పడు సమావేశాల ప్రారంభం సందర్భంగా రాజ్యాంగ అమలుకు ప్రభుత్వం కమిట్మెంట్తో ఉందంటూ పేర్కొనడం కన్నా పెద్ద జోక్ ఇంకొకటి లేదన్నారు. దేశంలో గత కొద్ది నెలలుగా జరుగుతున్న ఘటనలు రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని ఆమె అసహనంపై మాట్లాడారు. దేశ స్వాంతత్ర్య పోరాటంలో, రాజ్యాంగ రచనలో కాంగ్రెస్ కృషిని ఈ సందర్భంగా సోనియా గుర్తుచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement