న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,566 కరోనా కేసులు నమోదు కాగా, 194 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,58,333కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు 67,691 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 4,531 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 86,110 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. (చదవండి : కరోనా బాధితురాలికి కవల పిల్లలు)
ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌లలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధికంగా మహారాష్ట్రలో 56,948 కరోనా కేసులు నమోదు కాగా, 1,897 మంది మృతిచెందారు. అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా నుంచి కోలుకుంటున్నవారి నిష్పత్తి మెరుగ్గా ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో రికవరీ రేటు 42.45 శాతంగా ఉన్నట్టు బుధవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment