ప్రతీకాత్మక చిత్రం
తిరువనంతపురం: కేరళలో బుధవారం కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఈ 11 మందిలో ఐదుగురికి విదేశీ ప్రయాణ చరిత్ర ఉందని, ముగ్గురికి స్థానిక కాంటాక్ట్స్ ద్వారా కోవిడ్ సోకిందని వెల్లడించారు. కేరళలో ఇప్పటివరకు మొత్తం 437 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 127 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఒడిశాలో మరో పాజిటివ్..
ఒడిశాలోని జాజ్‌పూర్‌లో బుధవారం మరొకరు కోవిడ్-19 బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 83కి చేరింది. ఇందులో 50 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కోవిడ్ బారిన పడి 32 మంది కోలుకోగా, ఒకరు మృతి చెందారు.
కాగా, దేశవ్యాప్తంగా బుధవారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలు దాటగా, మృతుల సంఖ్య 652కి చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 5221, గుజరాత్‌లో 2272, ఢిల్లీలో 2156 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్‌లలో ఒక్కో కరోనా కేసు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment