కరోనా వైరస్‌కు దరిచేరకుండా ఉండాలంటే ఇతరులతో పరస్పరం దూరంగా ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం అత్యుత్తమ మార్గం. అలాగే, పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. కరోనా వైరస్ ఒక్కో ఉపరితలాన్ని బట్టి వైరస్ కొన్ని గంటలపాటు జీవించి ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌డోర్స్, అవుట్‌డోర్స్, పబ్లిక్ టాయిలెట్స్ లో వైరస్ ప్రభావం ఒక్కో విధంగా ఉంటుంది. కోవిడ్-19 ఎదుర్కొనేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు
ఇన్‌డోర్స్ :
1. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఎంట్రన్స్ లాబీలు, కారిడార్లు మరియు మెట్లు, ఎస్కలేటర్లు, ఎలివేటర్లు,సెక్యూరిటీ గార్డ్ బూత్‌లు, కార్యాలయ గదులు, మీటింగ్ రూమ్స్..ఇలా ఎక్కుమంది తాకే ప్రతి స్థలాన్ని 1% సోడియం హైపోక్లోరైట్ లేదా ఫినోలిక్ ద్రావణంతో శుభ్రం చేయాలి.
2. ఉపరితలంపై ఈ వైరస్ కొన్ని గంటలపాటు ఉంటుంది. కాబట్టి తరుచూగా తాకే ఎలివేటర్ బటన్స్, కాల్ బటన్స్, పబ్లిక్ కౌంటర్స్, టెలిఫోన్స్, ప్రింటర్స్, స్కానర్స్, టేబుల్స్, పెన్నులు, ఫైల్స్, కీబోర్డ్, మౌస్, కాఫీ మెషిన్ ఇలా తరుచుగా తాకే ఆస్కారం ఉన్న వస్తువులను 1% సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో రోజుకు రెండుసార్లు శుభ్రం చేయాలి. మెటాలిక్ ఉపరితలం లాంటి డోర్ హ్యాండిల్స్, సెక్యురిటీ లాక్స్, కీలు వంటి వాటిని శుభ్రం చేయడానికి 70% ఆల్కహాల్ కలిగిన ద్రావణంతో వాడాలి.
3. కార్యాలయ ఎంట్రన్స్‌పాయింట్ వద్ద హ్యాండ్ శానిటైజర్స్ ఏర్పాటు చేయాలి. ఆఫీసుల్లో మాస్కులు లేకుండా ఎవరైనా తుమ్మినా, దగ్గినా ఆ ప్రదేశాన్ని 1% సోడియం హైపోక్లోరైట్ కలిగిన ద్రావణంతో శుభ్రం చేయాలి. ఆ ప్రాంతాల్లో వైరస్ ఎక్కువగా ఇతరులకు సోకే ప్రమాదం ఉన్నందున శుభ్రం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. ముఖానికి మాస్కు, చేతులకి గ్లవుజులు తప్పనిసరి. మాస్కులను వాడి పడేసటప్పడు కింద పడేయకుండా జాగ్రత్తగా డస్ట్‌బిన్లో పడేశాక చేతులను సబ్బుతో శుభ్రపరుచుకోవాలి.
బహిరంగ ప్రదేశాలు (అవుట్‌డోర్) :
బస్‌స్టాపులు. రైల్వే ప్లాట్‌ఫామ్‌లు, పార్కులు, రోడ్లు లాంటి బహిరంగ ప్రదేశాల్లో అందరూ తరుచుగా తాకే ఉపరితలాలను తాకకపోవడమే మంచిది. ఇన్‌డోర్ ప్రదేశాలతో పోలిస్తే సూర్యరశ్మి ఎక్కువగా ఉండే అవుట్‌డోర్ ప్రదేశాల్లో రిస్క్ కాస్త తక్కువే. కానీ తగిన జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం ముప్పు ముంచుకొస్తుంది.
పబ్లిక్ టాయిలెట్లు :
పారిశుద్ద్య కార్మికులు పబ్లిక్ టాయిలెట్లను శుభ్రపరిచేటప్పుడు కశ్చితంగా మాస్కులు, చేతులకి గ్లౌజులు వాడాలి. పబ్లిక్ టాయిలెట్లను, సింకులను శుభ్రపరచడానికి వేరువేరు పరికరాలు వాడాలి.
► టాయిలెట్ పాట్‌ను 1% సోడియం హైపోక్లోరైట్ లేదా డిటర్జెంట్‌తో పొడవాటి బ్రష్‌తో , స్క్రబ్బర్‌తో టాయిలెట్ బయటి ప్రదేశాన్ని శుభ్రం చేయాలి.
► సోప్ పౌడర్ లేదా డిటర్జెంట్‌తో సింకులను శుభ్రం చేయాలి. 1% సోడియం హైపోక్లోరిన్ ద్రావణంతో స్క్రబ్ చేస్తూ సింకులను శుభ్రం చేయాలి.
► బాత్‌రూ ఫ్లోర్స్, టైల్స్‌ని వేడినీళ్లు, డిటర్జెంట్‌తో షవర్స్, ట్యాప్‌లను శుభ్రం చేయాలి. 1% సోడియం హైపోక్లోరిన్ లేదా 70% ఆల్కహాల్ ద్రావణంతో ట్యాప్ ఫిట్టింగ్స్‌ను శుభ్రం చేయాలి.
► సోప్ డిస్పెన్సర్లను సబ్బు, డిటర్జెంట్లతో ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ తడిగా లేకుండా చూడాలి.
► 70% ఆల్కహాల్ ద్రావణంతోనే ఉపరితలాన్ని శుభ్రం చేయాలి. బ్లీచ్‌ను వాడరాదు. క్లోరోక్సిలెనాల్ (4.5-5.5%) లేదా బెంజల్కోనియం క్లోరడ్ తో కాని శుభ్రంచేయాలి.
► టాయిలెట్ ఏరియాల్లో క్రిమి సంహారక స్ప్రేలను వాడరాదు. దీని వల్ల వైరస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. క్లీనింగ్ ప్రాసెస్‌లో గ్లౌవుజులను తప్పనిసరిగా ధరించాలి. ఒకసారి వాడిన గ్లౌజులను మళ్లీ వాడరాదు.
► ట్యాప్, బకెట్లను వాడాక వేడినీళ్లతో కూడిన సోప్ వాటర్‌తో శుభ్రం చేయాలి.
పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్యూప్‌మెంట్ (పీపీఈ)
ఏదైనా వస్తువును, ప్రదేశాలను శుభ్రపరిచేముందు వాడాల్సిన ఎక్యూప్‌మెంట్స్ :
► రబ్బర్ బూట్లు, గ్లౌజులు, ట్రిపుల్ లేయర్ మాస్కులను ధరించాలి.
► ఒకసారి వాడిపడేసిన మాస్కులు, గ్లౌజులు మళ్లీ వాడరాదు.
► మాస్కును రోజులో 6 నుంచి 8 గంటలు మాత్రమే ధరించాలి.
► క్లీనింగ్ అయ్యాక తప్పనిసరిగా చేతులను సబ్బుతో శుభ్రపరుచుకోవాలి.
సోడియం హైపోక్లోరిన్ తయారుచేయు విధానం:
►సోడియం హైపోక్లోరిన్ లిక్విడ్ బ్లీచ్‌కి 3.5% క్లోరిన్, ఒకశాతం బ్లీచ్‌కి, రెండున్నర శాతం నీళ్లు కలపాలి.(లేదా)
► సోడియం హైపోక్లోరిన్ లిక్విడ్‌కి 5% క్లోరిన్, ఒక శాతం బ్లీచ్‌కి, 4 శాతం నీళ్లు కలపాలి.(లేదా)
► సోడియం డైక్లోరోయిసోసైనూరేట్ మిశ్రమానికి, 60% క్లోరిన్, 17 గ్రామ్- 1 లీటర్ నీళ్లు కలపాలి.(లేదా)
► సోడియం డైక్లోరోయిసోసైనూరేట్ 1.5 గ్రాముల టాబ్లెట్‌కి, 60% క్లోరిన్, 11 గ్రామ్- 1 లీటర్ల నీళ్లు కలపాలి.(లేదా)
► క్లోరమైన్ మిశ్రమానికి 25% క్లోరిన్, 80 గ్రాము-1 లీటర్ నీళ్లను కలపాలి.(లేదా)
► బ్లీచింగ్ పౌడర్‌కి 70% క్లోరిన్, 7 గ్రాము- 1 లీటర్ నీళ్లను కలపాలి.
మాస్కులను వాడే పద్ధతి :
1. ముక్కు, నోరు, గడ్డం భాగాలను కప్పి ఉంచే విధంగా ఉండాలి.
2. మాస్కులు శుభ్రంగా , ఎలాంటి గ్యాప్‌లు లేకుండా ఉండేలా చూసుకోవాలి.
3. రోజులో 6-8 గంటలు మాత్రమే ఒక మాస్కుని వాడాలి.
4. ఒకసారి వాడాక మళ్లీ తిరిగి వాడరాదు.
5. వాడేసిన మాస్కులను తొలగించేటప్పడు చాలా జాగ్రత్తగా పడేయాలి.
6. కప్పిఉన్న డస్ట్‌బిన్లలోనే వాడిన మాస్కులను పడేయాలి.
Comments
Please login to add a commentAdd a comment