సాక్షి,లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఒక ప్రముఖ హోటెల్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చార్‌బాగ్ ప్రాంతంలోని ఎస్‌ఎస్‌జె ఇంటర్నేషనల్ హోటల్‌లో ఆకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. భవనంలోని మొదటి అంతస్థులో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసు ఉన్నతాధికారులు సహాయక చర్చలను పర్యవేక్షిస్తున్నారు. సంఘటనా చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయ్నతిస్తున్నారు. భవనంలోని సిబ్బందిని తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఎస్‌ఎస్‌జే హోటల్ పూర్తిగా మంటల్లో చిక్కుకోగా పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంతోపాటు, మరో హోటల్‌కు కూడా అగ్నీకీలలు విస్తరించాయి. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదనీ, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment