బీహార్ : బీహార్‌లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నలందా జిల్లా పరిధిలోని హరనౌత్ ప్రాంతంలో ఓ ట్రక్ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై మీద నిద్రిస్తున్న స్థానికులపై వాహనం దూసుకుపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడికే మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. దాంతో ఆగ్రహించిన స్థానికులు ఆందోళనకు దిగారు. ట్రక్‌ను తగలబెట్టి రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి.... పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు.