గుజరాతీ రచయిత సీతాన్షు యశశ్చంద్ర
న్యూఢిల్లీ: ప్రముఖ గుజరాతీ రచయిత సీతాన్షు యశశ్చంద్ర కవితా సంకలనం ‘వాఖర్’ 2017 ఏడాదికి సరస్వతి సమ్మాన్ అవార్డు గెలుచుకుంది. లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శి సుభాష్ సి. కశ్యప్ నేతృత్వంలోని కమిటీ ఈ ఎంపిక చేసింది. 2009లో వాఖర్ ప్రచురితమైంది. 1941లో భుజ్‌లో జన్మించిన యశశ్చంద్ర సమకాలీన గుజరాతీ రచయితల్లో అగ్రగణ్యులుగా పేరొందారు. కవి, నాటక రచయిత, అనువాదకుడు, విద్యావేత్త అయిన ఆయన వాఖర్‌తో పాటు మరో రెండు కవితా సంకలనాలను రాశారు. నాటకాలపై 10 పుస్తకాలు, విమర్శనాత్మక సాహిత్యంపై మూడు పుస్తకాలు వెలువరించారు. కేకే బిర్లా ఫౌండేషన్ ప్రదానం చేసే ఈ అవార్డు కింద రూ.15 లక్షల నగదు, ప్రశంసా పత్రం, జ్ఞాపిక ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment