అణు బలం : అగ్ని-1 సక్సెస్‌ | India Test Fires Agni 1 ballistic Missile | Sakshi
Sakshi News home page

అణు బలం : అగ్ని-1 సక్సెస్‌

Published Tue, Feb 6 2018 5:04 PM | Last Updated on Tue, Feb 6 2018 5:04 PM

India Test Fires Agni 1 ballistic Missile - Sakshi

ప్రయోగ సందర్భంగా అగ్ని-1 అణ్వాయుధ సామర్ధ్య క్షిపణి

సాక్షి, న్యూఢిల్లీ : స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన అగ్ని-1 అణ్వాయుధ క్షిపణి మంగళవారం భారత్‌ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని డా. అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి ఉదయం 8.30 గంటలకు ప్రయోగం నిర్వహించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది.  

ఆపరేషనల్‌ రెడీనెస్‌ కోసం భారతీయ ఆర్మీకి చెందిన స్ట్రాటజిక్‌ ఫోర్స్‌ కమాండ్‌(ఎస్‌ఎఫ్‌సీ) అగ్ని-1 18వ వెర్షన్‌ క్షిపణిని ప్రయోగించిందని వివరించింది. ప్రయోగానికి ముందు నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను అగ్ని-1 అందుకున్నట్లు పేర్కొంది.

  • 700 కి.మీ పరిధిలోని లక్ష్యాలను అగ్ని-1 ద్వారా చేధించొచ్చు.
  • స్వదేశీ సాంకేతికతతో తయారైన అగ్ని-1ను 2004లో సర్వీసులో చేరింది. దీన్ని ఉపయోగించి భూమి ఉన్న లక్ష్యాలను అందుకోవచ్చు.
  • అగ్ని-1 తాజా వెర్షన్‌లో వినియోగించిన ప్రత్యేక నేవిగేషన్‌ వ్యవస్థ ద్వారా ఎంచుకున్న లక్ష్యాన్ని చేధించితీరుతుంది.
  • అత్యవసర సమయాల్లో అగ్ని-1 ను ప్రయోగించేందుకు అతి తక్కువ సమయం మాత్రమే పడుతుంది.
  • 12 టన్నులు బరువుండే అగ్ని-1 వెయ్యి కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement