![MLA Ambarish skip sessions and his video viral - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/15/AMbarish.jpg.webp?itok=TGY7ueWk)
సాక్షి, బెంగళూరు : ఓ వైపు డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసుపై బెళగావి సువర్ణసౌధ విధానసభ రెండోరోజూ వాద, ప్రతివాదాలతో ప్రతిధ్వనించగా.. మరోవైపు బాధ్యతాయుత అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబరీష్ మాత్రం డ్యాన్సులు చేస్తూ విమర్శల పాలయ్యారు. గణపతి కేసుపై సభలో చర్చ జరగాలని, సీబీఐ ఏ1 గా పేర్కొన్న మంత్రి కె.జె.జార్జ్ తక్షణమే రాజీనామా చేయాలంటూ వరుసగా మంగళవారం రెండో రోజు కూడా సభలో బీజేపీ పక్షనేత జగదీష్ శెట్టర్ సహా ఆ పార్టీ నేతలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
అయితే అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబరీష్ వాడీవేడిగా జరుగుతున్నా.. బాధ్యతాయుతమైన వ్యక్తి అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టి నవ్వుల పాలవుతున్నారు. ఓ వైపు సమావేశాలకు డుమ్మా కొట్టడమే అంబరీష్ చేసిన తప్పిదం కాగా, మ్యూజిక్ ఈవెంట్లలో పాల్గొని డ్యాన్సులు చేస్తున్నారని నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. బెంగళూరులో జరిగిన ఈవెంట్లో అంబరీష్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయన బాధ్యతారాహిత్యంపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. ప్రజల కష్టాలు పట్టించుకోకుండా, సామాజిక అంశాలపై నిర్లక్ష్యంతో పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ఫంక్షన్లలో స్టెప్పులేస్తున్న వ్యక్తి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment