కేసీఆర్కు మోదీ తెలుగులో లేఖ | modi writes letter to kcr in telugu | Sakshi
Sakshi News home page

కేసీఆర్కు మోదీ తెలుగులో లేఖ

Published Mon, Feb 20 2017 9:26 PM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

కేసీఆర్కు మోదీ తెలుగులో లేఖ - Sakshi

కేసీఆర్కు మోదీ తెలుగులో లేఖ

హైదరాబాద్ :
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాశారు. కేసీఆర్ పుట్టిన రోజు(శుక్రవారం) సందర్భంగా ఆయనకు మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే కేసీఆర్ పుట్టిన రోజుకు దగ్గర్లోనే ఫిబ్రవరి 21న(మంగళవారం) మాతృభాషాదినోత్సవం కూడా కావడంతో ఈ లేఖను మోదీ తెలుగులో పంపినట్టు తెలుస్తోంది.

దేశ ప్రజలకు మీరు సేవలందించేందుకు వీలుగా కావలసిన ఆరోగ్యకర, ఆనందమయ జీవితాన్ని ప్రసాదించాలని భగవంతున్ని కోరుతున్నానని మోదీ తెలిపారు. ఈ లేఖను తెలంగాణ సీఎంవో తమ అధికారిక ఫేస్ బుక్‌ పేజీలో సోమవారం పోస్ట్ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement