![Narendra Modi Review Meeting With Health Officials Over Coronavirus - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/7/modi2.jpg.webp?itok=VUBL4Nuu)
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ముందుగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిపై ఆరోగ్య శాఖ కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఏ మేరకు ప్రభావం చూపుతుందనేదానిపై వివరించారు. అనంతరం అధికారులకు మోదీ పలు సూచనలు చేశారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సరిహద్దుల వద్ద స్క్రీనింగ్‌ను పటిష్టం చేయాలని ఆదేశించారు. ప్రమాదకర కరోనా కట్టడికి అన్ని మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
వైరస్ సోకకుండా ప్రజలకు సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రధాని ఆదేశించారు. కొద్దిరోజుల పాటు ఎక్కువ సంఖ్యలో జనం గుమ్మికూడకుండా ఉండేలా చూడాలని అధికారులకు చెప్పారు. కరోనాపై వస్తున్న వదంతులను నమ్మొద్దని ప్రజలను ప్రధాని కోరారు. అలాగే ఇరాన్‌లో చిక్కుకుపోయిన మత్స్యకారులను వెంటనే భారత్‌కు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుకోవాలన అధికారులను ఆదేశించారు. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 31 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా రిపోర్టులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment