జైపూర్: రాజస్థాన్‌లో మరో ఆమ్ ఆద్మీ పార్టీలా సత్తా చాటుతుందనుకున్న నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) వాస్తవ పోరులో మాత్రం చతికిలపడింది. హంగ్ ఏర్పడితే ఆ పార్టీ కింగ్‌మేకర్ అవుతుందన్న అంచనాలు తేలిపోయాయి. రాజస్థాన్‌లోని మొత్తం 200 స్థానాల్లో 162 స్థానాలను బీజేపీ కొల్లగొట్టడంతో ఎన్‌పీపీకి చక్రం తిప్పే అవకాశం దక్కకుండా పోయింది.
గిరిజన నేత కిరోరీ లాల్ మీనా నేతృత్వంలోని ఎన్‌పీపీ 4 సీట్లను మాత్రమే దక్కించుకోగలిగింది. సవాయ్ మాధోపూర్, లాల్‌సోట్‌లలో పోటీ చేసిన మీనా మాధోపూర్‌లో బీజేపీ అభ్యర్థి దీపాకుమారి చేతిలో 7 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. లాల్‌సోట్‌లో తన మాజీ శిష్యుడు పర్సాదీ లాల్‌పై 491 స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు. మీనా భార్య రాజ్‌గఢ్-లక్ష్మణ్‌గఢ్ నుంచి గెలుపొందారు.
రాజస్థాన్‌లో చతికిలబడిన ఎన్‌పీపీ
Published Tue, Dec 10 2013 1:02 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement