కేంద్ర మాజీ ఉద్యోగులకు తీపి కబురు
న్యూఢిల్లీ: మాజీ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పూర్తి పింఛన్ పొందడానికి కనీసం 33 ఏళ్ల సర్వీసు ఉండాలన్న నిబంధనను కేంద్రం తొలగించడంతో 2006కు ముందు విరమణ పొందిన ఉద్యోగులకు అందే పింఛన్ మొత్తం పెరగనుంది. ఇది వారికిచ్చే బకాయిలకు అదనం.
సవరించిన పింఛన్.. వేతన శ్రేణిలోని కనీస వేతనంలో 50 శాతానికి తగ్గకుండా ఉంటుంద ని పింఛన్‌దారుల సంక్షేమ శాఖ తెలిపింది. కొత్త పింఛన్, బకాయిలు 2006, జనవరి1 నుంచి వర్తిస్తాయని ప్రకటించింది. 33 ఏళ్ల కన్నా తక్కువ కాలం సేవలందించిన వారు ఈ ప్రయోజనానికి అర్హులు అని వెల్లడించింది.