'క్లీన్‌చిట్‌ వచ్చే వరకు మోదీ రాజీనామా చేయాలి' | pm modi should resign untill he get clean chit: aravind kejriwal | Sakshi
Sakshi News home page

'క్లీన్‌చిట్‌ వచ్చే వరకు మోదీ రాజీనామా చేయాలి'

Published Wed, Dec 21 2016 6:56 PM | Last Updated on Mon, Aug 20 2018 3:46 PM

'క్లీన్‌చిట్‌ వచ్చే వరకు మోదీ రాజీనామా చేయాలి' - Sakshi

'క్లీన్‌చిట్‌ వచ్చే వరకు మోదీ రాజీనామా చేయాలి'

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీపై అవినీతి ఆరోపణలు రావడం ఇదే ప్రథమం అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. అవినీతి ఆరోపణల నుంచి క్లీన్‌చిట్‌ వచ్చే వరకు మోదీ రాజీనామా చేస్తారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీకి ముడుపులు ముట్టాయని రాహుల్‌ బాంబు పేల్చారు.

మోదీకి 6 నెలల్లో 9 సార్లు డబ్బులు చెల్లించినట్టు సహారా కంపెనీ వెల్లడించిందని చెప్పారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కేజ్రీవాల్‌ స్పందించారు. ప్రధాని అవినీతిపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. మరోపక్క, రాహుల్‌ ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. అవినీతిపై ఐటీ అధికారులు మోదీని ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించింది. స్వతంత్ర సంస్థతో మోదీ అవినీతిపై దర్యాప్తు జరిపించాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement