రాంపాల్ ఆశ్రమంలో రహస్యాలపై విచారణ
బర్వాలా: హర్యానా పోలీసులు ఆదివారం వివాదాస్పద స్వామి రాంపాల్ను విచారణ నిమిత్తం ఆయన ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఆశ్రమంలో రాంపాల్, ఆయన శిష్యుల రహస్య కార్యకాలపాల గురించి పోలీసులు విచారిస్తున్నారు. హిసార్ జిల్లాలోని బర్వాల పట్టణానికి సమీపంలో 12 ఎకరాల విస్తీర్ణంలో రాంపాల్ ఆశ్రమం ఉంది.
బుధవారం రాంపాల్ను అరెస్ట్ చేసి దేశ ద్రోహం సహా పలు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాంపాల్ అనుచరులకు, పోలీసులకు మధ్య జరిగిన దాడుల్లో ఆరుగురు మరణించారు. రాంపాల్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. రాంపాల్ ఆశ్రమంలో గురువారం నుంచి ప్రత్యేక విచారణ బృందం సోదాలు కొనసాగిస్తోంది. ఆశ్రమంలో రహస్య కార్యకలాపాలపైనా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే గర్భ నిర్ధారణ పరీక్షల కిట్లు లభ్యంకాగా, పెద్ద ఎత్తున లాకర్లు, కర్రలను దాచినట్టు గుర్తించారు. ప్రత్యేక బృందానికి సహకరించేందుకుగాను పోలీసులు రాంపాల్ను ఆశ్రమానికి తీసుకెళ్లారు.
చదవండి
(రాంపాల్ కు ఈనెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ)
(రాంపాల్ ఆశ్రమంలో గర్భనిర్ధారణ కిట్లు!!)