ఢిల్లీలో రూ. 150 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం | rs 150 crores drugs seazed | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో రూ. 150 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

Published Mon, Dec 30 2013 1:02 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

rs 150 crores drugs seazed

సాక్షి, న్యూఢిల్లీ: న్యూఇయర్ వేడుకల్లో ముగిని తేలే యువత లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠా సభ్యుడిని ఢిల్లీ స్పెషల్ బ్రాంచి పోలీసులు శనివారం వలపన్ని పట్టుకున్నారు. అతడి నుంచి 47 కేజీల హెరాయిన్, 2 కేజీల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ సుమారు రూ. 150 కోట్లు ఉంటుందని ఢిల్లీ క్రైం బ్రాంచ్ అదనపు కమిషనర్ శ్రీవాస్తవ ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. డ్రగ్స్ తరలిస్తూ ఈ నెల 18న పట్టుబడిన కడపవాసి ఎ.వేణుగోపాల్‌రెడ్డి సహా ముగ్గురు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఢిల్లీలోని తిలక్‌నగర్‌లో సోదాలు నిర్వహించి ఆర్తార్‌సింగ్ అనే మరో నిందితుడిని అరెస్టు చేశామన్నారు. అతన్నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ముఠా అఫ్ఘానిస్థాన్‌లో డ్రగ్స్ తయారు చేసి పాకిస్థాన్ మీదుగా పంజాబ్‌లో సరిహద్దు దాటించి దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement