బెంగళూరు: రాకెట్‌లోని వివిధ పరికరాలను బిగించేందుకు అత్యాధునిక సదుపాయాలతో రెండో భవనాన్ని (వెహికిల్ అసెంబ్లీ బిల్డింగ్) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. దీన్ని శ్రీహరి కోటలోని రెండో రాకెట్ లాంచ్ ప్యాడ్‌తో అనుసంధానం చేయాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ఇస్రో ఏటా 5 రాకెట్లను నింగిలోకి పంపుతోంది.
అయితే ఈ సంఖ్యను సమీప భవిష్యత్‌లో 8కి పెంచాలని, ఆ తర్వాత ఏడాదికి కనీసం 12 రాకెట్లు ప్రయోగించాలని భావిస్తున్నట్లు ఇస్రో సోమవారం తెలిపింది. ఈ లక్ష్యాలను అందుకోవాలంటే రెండో లాంచ్ ప్యాడ్‌కు అనుసంధానంగా రెండో వెహికిల్ అసెంబ్లీ భవనం నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపింది.
ఇస్రోలో రెండో రాకెట్ తయారీ భవనం!
Published Tue, Jan 12 2016 9:15 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM
Advertisement