శాస్త్ర ప్రపంచాన్ని తన గణిత మేధా సంపత్తితో ఉర్రూతలూ గించిన భారతీయ గణిత శాస్త్ర వేత్త శ్రీనివాస అయ్యంగార్ రామానుజన్. 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్ లో శ్రీనివాస అయ్యంగార్, కోమలమ్మాళ్ దంపతులకు జన్మించాడు. 11ఏళ్ల ప్రాయంలోనే, ఎస్.ఎల్ లోనీ రాసిన ‘‘అడ్వాన్స్‌డ్ ట్రిగనామెట్రీ’’ క్షుణ్ణంగా అభ్య సించాడు.
తన ఇంటి అరుగుపై కూర్చొని తెల్ల కాగితాలపై అనేక గణిత సిద్ధాంతాలను ఆవిష్కరించాడు. ఆయన రాసిన మేజిక్ స్క్వేర్స్, బెర్నేలి నంబర్స్, నిశ్చిత సమీకరణాలు, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ వంటి గణిత సిద్ధాంతాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. మద్రాసు పోర్టు ట్రస్టులో గుమస్తా గిరి చేస్తూనే గణితంపై కృషి సలిపాడు. ఇండియన్ మేథ మేటికల్ సొసైటీ వారి పత్రికలో రామానుజన్ రచిం చిన 14 పేజీల పరిశోధనా వ్యాసం ప్రచురితం కావ డం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.
మద్రాసు విశ్వవిద్యాలయం తన గణిత పరిశోధనలకు అవకా శమిచ్చి నెలకు రూ.75ల ఉపకార వేతనం మంజూరు చేసింది. రామానుజన్ కనుగొన్న 120 పరిశోధనా ఫలితాలను 1913లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లోని ప్రొఫెసర్. గాడ్ ఫ్రెహెరాల్డ్ హార్డీకి పంపించగా ఆయనను ఇంగ్లాండ్‌కు ఆహ్వానించారు. లండన్‌లోని ట్రినిటీ కాలేజీలో రామానుజన్ ఆరేళ్లు శ్రమించి 32 పరిశోధనా పత్రాలు సమర్పించి 1918లో రాయల్ సొసైటీ ఫెలోషిప్, ట్రినిటి కాలేజి ఫెలోషిప్ అందుకున్నాడు. దాదాపు 3900 సమీకరణాలు కనుక్కొని చరిత్ర సృష్టించాడు. తీవ్ర శ్రమతో క్షయ వ్యాధికి గురైన రామానుజన్ 1919లో భారత్ చేరుకున్నాడు. 1920 ఏప్రిల్ 26న 33 ఏళ్లు నిండకముందే కన్నుమూశాడు. భారత ప్రభుత్వం ఆయన పుట్టిన రోజును ‘జాతీయ గణిత దినోత్సవం’గా ప్రకటించి గౌరవించింది.
(నేడు శ్రీనివాస రామానుజన్ 127వ జయంతి)
గోపాలుని వెంకటేశ్వర్లు వేములకోట
గణిత వినువీధుల్లో మెరిసిన ధ్రువతార
Published Mon, Dec 22 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM
Advertisement