ఆ మూడు పార్టీలకు ఓటు వేయొద్దు | Mayawati Said Vote For BSP In Telanagana | Sakshi
Sakshi News home page

ఆ మూడు పార్టీలకు ఓటు వేయొద్దు

Published Wed, Nov 28 2018 7:56 PM | Last Updated on Wed, Nov 28 2018 8:15 PM

Mayawati Said Vote For BSP  In Telanagana  - Sakshi

సాక్షి, మంచిర్యాల: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేయద్దని బీఎస్పీ అధినేత్రి మాయావతి పిలుపునిచ్చారు. మంచిర్యాలలో బుధవారం బీఎస్పీ నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ.. ‘ఇక్కడి ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేసింది. 

తెలంగాణలో బహుజనులకు రాజ్యాధికారం వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి కేంద్రం నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామన్న నరేంద్రమోదీ సర్కార్ మాట తప్పింది’ అని విమర్శించారు.  

కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఉద్యోగుల పదోన్నతుల విషయంలో నిర్లక్ష్యం వహించాయన్నారు.ప్రైవేట్‌ రంగంలోనూ రిజర్వేషన్లు కల్పిస్తే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్‌లకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. బహుజనులకు రాజ్యాధికారం వస్తేనే అంబేడ్కర్, కాన్షీరాం ఆశయాలు నిజమవుతాయని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement