సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క డీఎస్సీని కూడా ఎందుకు నిర్వహించలేకపోయిందని అడిగారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.
తాము అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని, కేసీఆర్‌లా వట్టి మాటలు తాము చెప్పబోమని ఉత్తమ్ అన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. సూటు-బూటు ధరించి మంత్రి కేటీఆర్ విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment