విజయంతో ముగించాలని... | Big names give West Indies much- needed heft | Sakshi
Sakshi News home page

విజయంతో ముగించాలని...

Published Sun, Jul 9 2017 1:35 AM | Last Updated on Tue, Sep 5 2017 3:34 PM

విజయంతో ముగించాలని...

విజయంతో ముగించాలని...

నేడు విండీస్‌తో భారత్‌ ఏకైక టి20 మ్యాచ్‌
ఓపెనర్‌గా కోహ్లి
♦ రాత్రి 9 గంటల నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం  


విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత జట్టు ఇప్పుడు ఏకైక టి20 మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా అంతగా పేరులేని ఆటగాళ్లతో కనిపించిన విండీస్‌ ఒక్కసారిగా స్టార్‌ ఆటగాళ్లతో కళకళలాడుతోంది. క్రిస్‌ గేల్, పొలార్డ్, నరైన్‌ల రాకతో ఈ జట్టు అమాంతం బలపడింది. అయినా తమ జైత్రయాత్రతోనే కరీబియన్‌ పర్యటనను ముగించాలని భారత్‌ భావిస్తోంది. ఇక తమ స్టార్‌ ఆటగాళ్ల అండతోనైనా పొట్టి ఫార్మాట్‌లో పర్యాటక జట్టును దెబ్బతీయాలని విండీస్‌ కసితో ఉంది.

కింగ్‌స్టన్‌: భారత జట్టు కరీబియన్‌ పర్యటన చివరి దశకు వచ్చింది. ఆదివారం సబీనా పార్క్‌లో జరిగే ఏకైక టి20లో వెస్టిండీస్‌ను టీమిండి యా ఎదుర్కోనుంది. 15 నెలల అనంతరం జా తీయ జట్టులో చేరిన విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ రాకతో ఆతిథ్య జట్టులో ఒక్కసారిగా జోష్‌ పెరిగింది. ప్రపంచంలో ఏమూల టి20 క్రికెట్‌ లీగ్‌లు జరిగినా చోటు దక్కించుకునే విండీస్‌ ఆటగాళ్లు ప్రస్తుత  జట్టులో ఉన్నారు. దీంతో ఎలాంటి పొరపాట్లకు తావీయకుండా విజయంపై దృష్టి పెట్టాలని కోహ్లి సేన ఆలోచిస్తోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 3–1తో గెలుచుకున్న భారత్‌ ఈ మ్యాచ్‌లోనూ ఫేవరెట్‌గానే బరి లోకి దిగుతోంది. అయితే టి20 ప్రపంచ చాంపియన్స్‌ అయిన విండీస్‌ వీరులను తక్కువగా అంచనా వేస్తే భారత్‌ భంగపడాల్సి ఉంటుంది.

ఓపెనర్‌గా కోహ్లి!
ఐపీఎల్‌లో తన సహచరుడు గేల్‌ తాకిడిని తట్టుకునేందుకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎం దుకంటే ఆ జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచా ల్సి వచ్చినా.. లేదా ఛేదించాల్సి వచ్చినా వేగంగా పరుగులు తీయడం ముఖ్యం. ఒంటి చేత్తో మ్యా చ్‌ను గెలిపించే సత్తా విండీస్‌ ఆటగాళ్ల సొంతం. అందుకే తుది జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. వన్డే సిరీస్‌లో అద్భుతంగా చెలరేగిన రహానేకు ఇక్కడ చోటు దక్కడం అనుమానమే. ధావన్‌తో కోహ్లి ఇన్నింగ్స్‌ను ఆరంభిం చే అవకాశాలున్నాయి. ఇక ఇప్పటిదాకా బెంచ్‌కే పరిమితమైన యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌కు చాన్స్‌ దక్కవచ్చు. టి20ల్లోనూ కుల్దీప్‌ యాదవ్‌ అరంగేట్రం ఖాయమే. పేసర్‌ షమీ, భువనేశ్వర్‌లలో ఒకరికే చోటు దక్కే అవకాశముంది.

పటిష్టంగా విండీస్‌
గేల్, పొలార్డ్, నరైన్, మార్లోన్‌ శామ్యూల్స్, బ్రాత్‌వైట్, బద్రీల చేరికతో విండీస్‌ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌ ఆధ్వర్యంలో జట్టు బరిలోకి దిగబోతోంది. ఐపీఎల్‌లో నరైన్‌ అటు బౌలింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. స్పిన్‌లో బద్రీ జట్టుకు అదనపు బలం. టేలర్, విలియమ్స్‌ తమ పేస్‌తో భారత్‌ను ఇబ్బందిపెట్టాలని భావిస్తున్నారు.

జట్లు (అంచనా):
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, యువరాజ్, రిషభ్, ధోని, కేదార్‌ జాదవ్‌ / దినేశ్‌ కార్తీక్, పాండ్యా, కుల్దీప్, జడేజా/అశ్విన్, భువనేశ్వర్‌/షమీ, ఉమేశ్‌ యాదవ్‌.
విండీస్‌: బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), గేల్, లూయిస్, శామ్యూల్స్, జేసన్‌ మొహమ్మద్, వాల్టన్, పొలార్డ్, నరైన్, టేలర్, బద్రీ, విలియమ్స్‌.

పిచ్, వాతావరణం
చివరి వన్డే ఆడిన పిచ్‌పైనే ఈ మ్యాచ్‌ కూడా జరగనుంది. బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో భారీ స్కోరు ఖాయం. మ్యాచ్‌కు వర్షం వల్ల ముప్పు లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement