రోహిత్‌.. నా బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చు: చహల్‌ | Chahal to be Indias new No 3 during New Zealand T20s, jokes Rohit | Sakshi
Sakshi News home page

రోహిత్‌.. నా బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చు: చహల్‌

Published Mon, Feb 4 2019 11:13 AM | Last Updated on Mon, Feb 4 2019 11:23 AM

Chahal to be Indias new No 3 during New Zealand T20s, jokes Rohit - Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో భారత్‌ విజయం సాధించడంతో సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన చివరి వన్డేలో భారత్‌ 35 పరుగుల తేడాతో గెలుపొంది తమకు ఎదురులేదని మరోసారి నిరూపించింది. కాగా, హామిల్టన్‌ వేదికగా జరిగిన నాల్గో వన్డేలో మాత్రమే భారత్‌ ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో భారత్‌ 92 పరుగులకు ఆలౌట్‌ కాగా, అందులో యజ్వేంద్ర చహల్‌ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అదే సమయంలో కుల్దీప్‌ యాదవ్‌తో కలిసి 25 పరుగుల భాగస్వామ్యాన్ని చహల్‌ నమోదు చేశాడు. ఇదే ఆ మ్యాచ్‌లో అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది.

అయితే ఐదో వన్డే తర్వాత టీవీ యాంకర్‌ అవతారమెత్తిన చహల్‌.. రోహిత్‌ను ఇంటర్య్వూ చేశాడు. కివీస్‌పై వన్డే సిరీస్‌ విజయాన్ని ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారంటూ రోహిత్‌ను ముందుగా చహల్‌ అడిగాడు. ఆ క్రమంలోనే తనను బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చమంటూ విజ్ఞప్తి చేశాడు. అది కూడా కోహ్లి స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలంటూ విన్నవించాడు. ‘ కివీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో నన్ను మూడో స్థానంలో  బ్యాటింగ్‌కు దింపుతావా రోహిత్‌ భయ్యా. కోహ్లి గైర్హాజరీ కారణంగా ఆ స్థానాన్ని నాకు కేటాయించు’ అని చహల్‌ జోక్‌ చేశాడు. దీనికి రోహిత్‌ శర్మ బదులిస్తూ.. ‘నాల్గో వన్డేలో నువ్వు టాప్‌ స్కోరర్‌గా నిలిచావ్‌. అంతవరకూ ఓకే కానీ ఆ మ్యాచ్‌ ఓడిపోయింది కదా. అయినా నీ విజ్ఞప్తిని పరీశిలిస్తాం. నిన్ను మూడో స్థానంలో పంపడానికి కోచ్‌ రవిశాస్త్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా’ అని మరింత సరదాగా మాట్లాడాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement