తౌరంగా/న్యూజిలాండ్: టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు.. స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చహల్ వీలు చిక్కినప్పుడల్లా రోహిత్‌ను సరదాగా ఆటపట్టిస్తుంటాడు. ఇందుకు రోహిత్‌తో పాటు అతడి భార్య రితిక కూడా చహల్‌కు అదే స్థాయిలో బదులిస్తూ ఉంటారు. చమత్కారపు కామెంట్లతో చహల్‌ను ట్రోల్ చేస్తూ ఉంటారు. తాజాగా మరోసారి రోహిత్.. చహల్ ఫొటోపై కామెంట్ చేశాడు. ప్రస్తుతం చహల్ న్యూజిలాండ్ టూర్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో జట్టు సహచరుడు శ్రేయస్ అయ్యర్‌ను వెనుక నుంచి హత్తుకుని ఉన్న ఫొటోను చహల్ తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్లో షేర్ చేశాడు. దీనికి ‘గాట్ ఆల్వేస్ యువర్ బ్యాక్’ అనే క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు స్పందించిన రోహిత్ శర్మ... ‘‘ముందు నీ వీపును నువ్వు చూసుకో’’ అంటూ సరదాగా బదులిచ్చాడు. ఇక చహల్ కూడా ఏమాత్రం తగ్గకుండా... ‘‘భయ్యా నువ్వు ఇక్కడ లేవు కాబట్టి నన్ను మిస్ అవుతున్నావని నాకు తెలుసు. అంతగా అసూయ పడకు. త్వరలోనే నీతో కలిసి ఫొటో దిగుతాను కదా’’ అంటూ సమాధానమిచ్చాడు. ఇక చహల్ ఇటీవల శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు తరచుగా పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ పైవిధంగా స్పందించాడు.
చహల్, అయ్యర్ ‘విక్టరీ డ్యాన్స్’ చూశారా?
కాగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన కోహ్లి సేన.. వన్డే సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే కివీస్‌కు అప్పజెప్పిన టీమిండియా.. మంగళవారం జరిగే నామ మాత్రపు మూడో వన్డేకు సిద్ధమవుతోంది. మౌంట్ మాంగనీలో జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పరువు నిలుపుకోవాలని కోహ్లి సేన భావిస్తోంది. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అదరగొట్టిన రోహిత్... గాయం కారణంగా వన్డేలు, టెస్టులకు దూరమైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment