వెల్లింగ్టన్: పదేళ్ల తర్వాత న్యూజిలాండ్ గడ్డపై వన్డే సిరీస్ గెలవడంతో టీమిండియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కివీస్‌తో జరిగిన ఐదో వన్డేలో 35 పరుగుల తేడాతో రోహిత్ సేన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవం సందర్భంగా టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను చూసి సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని దూరంగా పారిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ప్రపంచంలోని ఏ బౌలర్ కూడా ధోనిని భయపెట్టలేదు.. కానీ చహల్ భయపెట్టాడు అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
అసలు విషయమేమిటంటే
మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా ఆటగాళ్లను చహల్ ఇంటర్వ్యూ చేస్తుంటాడు. చాహల్ టీవీ పేరుతో ఈ ఇంటర్వ్యూలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేస్తున్నది. అయితే కివీస్‌తో ఐదో వన్డే అనంతరం చహల్ ధోనిని ఇంటర్వ్యూ చేయాలని ప్రయత్నించగా.. అతడు దూరంగా పారిపోయాడు. అయినప్పటికీ ధోనిని వదలిపెట్టని చహల్, చాలా దూరమే పరిగెత్తాడు. కానీ ఇంటర్వ్యూ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో రోహిత్ శర్మను ఫన్నీగా ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment