సాక్షి, హైదరాబాద్: ‘క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ పోరపాటుతోనో, నిర్లక్ష్యంతోనే, అదృష్టం కలిసిరాకనో అవుటవుతుంటారు. కానీ టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరగా అవుటవ్వడం అలవాటు చేసుకున్నాడు’అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కటి కాదు రెండు కాదు ప్రతిభవున్న ఆటగాడని సెలక్టర్లు పదేపదే అవకాశాలు కల్పిస్తున్నా సద్వినియోగం చేసుకోలేక విఫలమవుతున్నాడు. ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి అలవాటులో అలవాటుగా త్వరగా వికెట్ సమర్పించుకొని పెవిలియన్ చేరాడు.
ఇక మ్యాచ్‌కు ముందు నుంచే రాహుల్‌ను జట్టులోకి తీసుకోవద్దంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపించాయి. గురువారం మ్యాచ్‌లో రెండు పరుగులు మాత్రమే చేసి వెనుదిరగటంతో సోషల్ మీడియా వేదికగా రాహుల్‌ను ఫ్యాన్స్ కడిగిపారేస్తున్నారు. ‘రాహుల్ బ్యాటింగ్ చేయడానికి వచ్చావా? లేకుంటే ఫోటో షూట్ కోసం వచ్చావా?’అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాహుల్‌పై సారథి విరాట్ కోహ్లి ఎలాంటి దయ ఉంచకుండా రెండో టెస్టుకైనా తప్పించాలని కోరుతున్నారు. టెస్టు క్రికెట్‌కు కావాల్సిన కనీస టెక్నిక్ రాహుల్‌కు లేదని ఎద్దేవ చేస్తున్నారు. రెండు ఓవర్లు కూడా ఆడని రాహుల్ నిజమైన క్రికెటరేనా అంటూ వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు.
Don't blame him guys. He had to attend a photoshoot session.
— Wasim Sheikh (@iamwasimsheikh) December 6, 2018
Meet the most overrated batsman, over hyped by cricket pandits: KL RAHUL. #AusvInd pic.twitter.com/7YNgrq6b6p
— Siddharth Jha (@jha_siddhus91) December 6, 2018
He just missed his 100 by 98 runs. But it's alright. He deserves infinite chances. #AUSvIND
— Swapnil Sarkar (@Swapnilsrkr) December 6, 2018
Comments
Please login to add a commentAdd a comment