హైదరాబాద్ 258 ఆలౌట్ | hyderabad bowled out at 258 | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ 258 ఆలౌట్

Published Thu, Oct 13 2016 10:56 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

hyderabad bowled out at 258

ముంబై: సీకే నాయుడు అండర్-23 క్రికెట్ టోర్నీలో భాగంగా ముంబై జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల మ్యాచ్లో హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్సలో 258 పరుగులకు ఆలౌటైంది. చైతన్య కృష్ణ (42), మల్లికార్జున్ (43), రోహిత్ రెడ్డి (46) ఆకట్టుకున్నారు. ముంబై బౌలర్లలో ములానీ, ఆదిత్య తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స ప్రారంభించిన ముంబై జట్టు బుధవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది.

 

ఆకర్షిత్ గోమెల్ (35), ఏక్నాథ్ కేర్కర్ (33 బ్యాటింగ్) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో సయ్యద్ 3, తనయ్ 2 వికెట్లు దక్కించుకున్నారు. ప్రస్తుతం ముంబై జట్టు 292 పరుగుల ఆధిక్యంలో ఉంది. ముంబై తొలి ఇన్నింగ్సలో 121.5 ఓవర్లలో 409 పరుగులకు ఆలౌటైంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement