న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ జవాన్లపై పుల్వామా ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌తో భారత్ అన్ని రకాల క్రీడా సంబంధాలను తెంచుకోవాలని భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఈ క్రమంలో వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా జూన్ 16న పాకిస్తాన్‌తో జరగాల్సిన మ్యాచ్‌నూ బహిష్కరించాలని పిలుపునిచ్చాడు.
‘ఈ క్లిష్ట సమయంలో రక్షణ బలగాలకు పూర్తి అండగా నిలవాలి. వారి త్యాగాలు వృథాగా పోవడానికి వీల్లేదు. పాక్‌తో ఆడకున్నా, మన ప్రపంచ కప్ విజయావకాశాలకు ఇబ్బందేం రాదు. అన్నింటికంటే దేశం ముఖ్యం. మనందరం దేశం కోసం నిలబడాలి. క్రికెట్, హాకీ ఇంకేదైనా సరే పాక్‌తో ఆడాల్సిన పని లేదు’ అని హర్భజన్ అన్నాడు.
ఇక్కడ చదవండి: పాక్‌తో ఆడే ముచ్చటే లేదు: ఐపీఎల్ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment