హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12లో మరో రసవత్తర పోరు నమోదయింది. శుక్రవారం స్థానిక రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరబాద్ విజయ ఢంకా మోగించింది. దీంతో ఈ సీజన్‌తో సన్‌రైజర్స్ పాయింట్ల ఖాతా తెరిచింది. రాజస్తాన్ నిర్ధేశించిన 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది.
ఛేదనలో సన్‌రైజర్స్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్(69; 37 బంతుల్లో 9ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్ స్టో(45;28 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్సర్) విజయ్ శంకర్(35, 15 బంతుల్లో 1ఫోరు, 3 సిక్సర్లు)లు రాణించారు. ఇక చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ రషీద్ ఖాన్(15 నాటౌట్), పఠాన్(16 నాటౌట్)లు జట్టును విజయతీరాలకు చేర్చారు. రాజస్తాన్ బౌలర్లలో శ్రేయాస్ గోపాల్ మూడు వికెట్లు తీయగా.. స్టోక్స్, ఉనద్కత్‌లు తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు రాజస్తాన్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్(102 నాటౌట్; 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు) చితక్కొట్టగా, అజింక్యా రహానే(70; 49 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు అలరించడంతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జోస్ బట్లర్(5) నిరాశపరచడంతో రాజస్తాన్ 15 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో రహానే-సంజూ శాంసన్‌ల జోడి నిలకడగా బ్యాటింగ్ చేసింది. వీరిద్దరూ 119 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి రాజస్తాన్‌ను గాడిలో పెట్టారు.
ప్రధానంగా రహానే సొగసైన షాట్లతో అలరించగా, శాంసన్ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. అయితే జట్టు స్కోరు 134 పరుగుల వద్ద ఉండగా రహానే భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. ఆ తర్వాత శాంసన్ మరింత రెచ్చిపోయి ఆడాడు. బౌండరీల లక్ష్యంగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా భువనేశ్వర్ వేసిన 18ఓవర్‌లో నాలుగు ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 24 పరుగులు సాధించడంతో రాజస్తాన్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఇక చివరి ఓవర్ మూడో బంతికి శాంసన్ పూర్తి చేసుకున్నాడు. 54 బంతుల్లో శాంసన్ సెంచరీ సాధించాడు. ఇది ఓవరాల్ ఐపీఎల్‌లో శాంసన్‌కు రెండో సెంచరీ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment