డెవెంటర్: అంతర్జాతీయ టీ 20 చరిత్రలో అరుదైన సందర్భం చోటు చేసుకుంది. స్కాట్లాండ్-ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ టై ముగిసి రికార్డు పుస్తకాల్లోకెక్కింది. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన నాల్గో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా, ఆ తర్వాత లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఐర్లాండ్ సైతం 185 పరుగులకే పరిమితమైంది. దాంతో మ్యాచ్ టైగా ముగిసింది. కాగా, ఇలా ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఫలితం తేలకుండా టై ముగియడం 2015 తర్వాత ఇదే తొలిసారి. మూడేళ్ల క్రితం ఇంగ్లండ్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన టీ 20 మ్యాచ్ చివరిసారి టైగా ముగియగా, ఆపై ఇంతకాలానికి మరొక టీ 20 మ్యాచ్‌లో ఫలితం రాకపోవడం గమనార్హం.
ఆరు టీ20ల సిరీస్‌లో భాగంగా తాజా మ్యాచ్‌లో స్కాట్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. స్కాట్లాండ్ ఆటగాళ్లలో జార్జ్ మున్సే(46), కోయిట్జర్(54), మెక్‌లీయాడ్(46)లు రాణించారు. అటు తర్వాత లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో ఐర్లాండ్ దూకుడుగా ఆడింది. ప్రధానం ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్(81; 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. దాంతో ఐర్లాండ్ విజయం సాధించడం ఖాయంగానే కనబడింది. అయితే స్కాట్లాండ్ బౌలర్లు చివర్లో కట్టడిగా బౌలింగ్ చేయడంతో ఐర్లాండ్ గెలుపుకు పరుగు ముందు ఆగిపోయి టైతో సరిపెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment