జస్‌ప్రీత్ బుమ్రా (ఫైల్)
ముంబయి : భారత పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా నేరుగా లంక సిరీస్‌లోనే బరిలోకి దిగనున్నాడు. వెన్నునొప్పి కారణంగా బుమ్రా సెప్టెంబరు నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్, ఆస్ట్రేలియాలో జరగనున్న 3 వన్డేల సిరీస్‌కు బుమ్రా ఎంపికయ్యాడు. అయితే దీనికి ముందు ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు రంజీ ట్రోపీలో గురువారం నుంచి గుజరాత్ తరపున కేరళతో జరిగే మ్యాచ్‌లో బుమ్రా ఆడాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో తన పునరాగమన ప్రక్రియపై ఆందోళన చెందిన బుమ్రా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైశాను కలిసినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన దాదా రంజీల్లో పాల్గొనకుండా ముందు వైట్‌బాల్‌పై దృష్టి సారించమని సలహా ఇచ్చినట్లు సమాచారం. దీంతో జస్‌ప్రీత్ బుమ్రా నేరుగా శ్రీలంక సిరీస్‌లోనే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. కాగా, బుమ్రాతో రంజీ మ్యాచ్‌లో రోజుకి 4-8 ఓవర్లు బౌలింగ్ చేయించాలని జాతీయ సెలక‌్షన్ కమిటీ చేసిన ప్రతిపాదనను గుజరాత్ జట్టు తిరస్కరిస్తూ అలాంటి రాయితీ బౌలింగ్‌ను తాము ప్రోత్సహించలేమని తేల్చి చెప్పినట్లు సమాచారం. బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 12 టెస్టుల్లో 62 వికెట్లు, 58 వన్డేల్లో 103 వికెట్లు, 42 టీ20ల్లో 51 వికెట్లు పడగొట్టాడు. (చదవండి : బుమ్రా యాక్షన్ షురూ...!)
Comments
Please login to add a commentAdd a comment