స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో నిఖత్‌బాను, విఘ్నయ్ విజేతలుగా నిలిచారు. నల్గొండ జిల్లా టేబుల్ టెన్నిస్ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల ఫైనల్లో నిఖత్‌బాను (జీఎస్‌ఎం) 9-11, 11-5, 11-5, 11-4, 11-9తో వరుణి జైశ్వాల్‌పై... పురుషుల ఫైనల్లో విఘ్నయ్ (ఆర్‌బీఐ) 8-11, 11-9, 8-11, 11-3, 11-9, 11-6తో హరికృష్ణ (జీటీటీఏ)పై గెలుపొంది టైటిల్స్‌ను దక్కించుకున్నారు.
ఇతర మ్యాచ్‌ల ఫలితాలు
క్యాడెట్ బాలికల సెమీస్: పలక్ (జీఎస్‌ఎం) 11-5, 11-5, 12-10తో కావ్య (ఏడబ్ల్యూఏ)పై, ఫాతిమా (స్టాగ్ అకాడమీ) 12-10, 11-9, 7-11, 11-9తో పూజ పై విజయం సాధించారు.
సబ్ జూనియర్ బాలికల సెమీస్: అంజలి (జీఎస్‌ఎం) 9-11, 7-11, 11-4, 11-8, 11- 7, 9-11, 11-8తో శ్రీవల్లి రమ్యపై, ఆయుషి (జీఎస్‌ఎం) 11-8, 11-9, 11-8, 7-11, 11-9తో భవిత (జీఎస్‌ఎం)పై గెలిచారు.
జూనియర్ బాలికల రెండో రౌండ్: ఆయుషి (జీఎస్‌ఎం) 11-5, 11-8, 11-9తో ఐశ్వర్య (ఏడబ్ల్యూఏ)పై, భవిత (జీఎస్‌ఎం) 11-6, 11-5, 11-6తో తేజస్విని (నల్గొండ)పై నెగ్గారు.
యూత్ బాలికల ప్రిక్వార్టర్స్: మోనిక (జీఎస్‌ఎం) 11-6, 11-9, 13-15, 6-11, 11-7, 13-11తో పలక్ షా (స్టాగ్ అకాడమీ)పై, వరుణి జైశ్వాల్ (జీఎస్‌ఎం) 11-4, 12-10, 12-10, 14-12తో శ్రీవల్లి రమ్యపై, ప్రణీత (హెచ్‌వీఎస్) 11-5, 11-2, 12-10, 11-7తో రచన (జీఎస్‌ఎం)పై, సస్య 11-3, 11-2, 11-4, 11-7తో ఇక్షితపై, ఆయుషి (జీఎస్‌ఎం) 11-6, 11-5, 13-11, 11-5తో హనీఫాపై, భవిత (జీఎస్‌ఎం) 12-10, 4-11, 9-11, 11-7, 14-12, 7-10, 11-9తో వినిచిత్రపై గెలుపొందారు.
సబ్ జూనియర్ బాలుర క్వార్టర్స్: కేశవన్ (జీటీటీఏ) 12-10, 11-7, 11-5తో కార్తీక్ (ఏడబ్ల్యూఏ)పై, రితేశ్ (జీటీటీఏ) 11-5, 11-9, 11-6తో రఘురామ్ (నల్గొండ)పై, వరుణ్ శంకర్ (జీటీటీఏ) 11-6, 11-4, 11-8తో సారుునాథ్ రెడ్డి (హెచ్‌వీఎస్)పై, ధనుష్ 13-11, 11-8, 9-11, 6-11తో విశాల్ (జీఎస్‌ఎం)పై విజయం సాధించారు.
యూత్ బాలుర రెండో రౌండ్: అరవింద్ (ఏడబ్ల్యూఏ) 11-5, 11-4, 11-5తో రోహిత్‌పై, ధనుష్ 11-4, 8-11, 5-11, 11-9, 13-11తో వృశిన్‌పై, పీయూశ్ అగర్వాల్ (స్టాగ్ అకాడమీ) 11-7, 11-3, 11-7తో ఆర్య (హెచ్‌వీఎస్)పై, అద్వైత్ (ఏడబ్ల్యూఏ) 11-8, 11-3, 12-10తో యశ్ యాదవ్ (స్టాగ్ అకాడమీ)పై గెలిచారు.
విజేతలు నిఖత్‌బాను, విఘ్నయ్
Published Sun, Nov 6 2016 10:24 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM
Advertisement
Advertisement