వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ బంతులు.. | Pakistan manufactured football Telstar18 to be used in tournament matches | Sakshi
Sakshi News home page

వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ బంతులు..

Published Tue, Jun 12 2018 1:26 PM | Last Updated on Fri, Jun 15 2018 4:33 PM

Pakistan manufactured football  Telstar18  to be used in tournament matches - Sakshi

మాస్కో: రష్యా వేదికగా మరో రెండు రోజుల్లో ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ టోర్నీ మొదలుకానుంది. దీంతో ప్రపంచం మొత్తం ఈ టోర్నీపైనే కన్నేసింది. ఫుట్ బాల్ ప్రపంచ కప్ టోర్నీ ఎప్పుడు మొదలవుతుంది అని ఆసక్తిగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతటి మెగా టోర్నీలో పాకిస్తాన్ కీలక భాగస్వామ్యం అవుతుంది. ఈ ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ టోర్నీకి పాకిస్తాన్ బంతుల్ని అందిస్తుంది.

ఫిఫా-2018లో వినియోగించనున్న టెల్‌స్టార్‌ 18 బంతులను పాకిస్తాన్‌లోని సియోల్‌కోట్‌లో తయారు చేస్తున్నారు. అయితే ఈ నగరం ప్రంపంచంలోని క్రీడా ఉత్పత్తులకు చాలా ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు క్రీడా ఉత్పత్తుల్ని సియోల్‌కోట్‌ నగరం ఎగుమతి చేస్తుంది. అయితే ఫుట్‌బాల్స్‌ తయారీలోనూ మంచి పేరు ఉండటంతో ఈసారి కూడా ఫుట్‌బాల్స్‌ కాంట్రాక్టును పొందింది సియోల్‌కోట్‌న నగరం. ఇంతకుముందు బ్రెజిల్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో వినియోగించిన బ్రజూకా బంతుల్ని కూడా పాకిస్తాన్ దేశమే తయారు చేసింది. ప్రస్తుతం ఫుట్ బాల్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుత పాకిస్తాన్‌ ర్యాంకు 198 గా  ఉంది. దాంతో వరల్డ్‌కప్‌లో పాక్‌ పాల్గొనడం ఇప‍్పట్లో జరిగే పని కాదు. కానీ మెగా టోర్నీకి బంతుల్ని తయారు చేయడం మాత్రం పాక్‌ గర్వించే విషయం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement