సింగిల్స్ చాంప్ రద్వాన్‌స్కా | Radwanska wins WTA Finals title | Sakshi
Sakshi News home page

సింగిల్స్ చాంప్ రద్వాన్‌స్కా

Published Mon, Nov 2 2015 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM

సింగిల్స్ చాంప్ రద్వాన్‌స్కా

సింగిల్స్ చాంప్ రద్వాన్‌స్కా

సింగపూర్: అందరి అంచనాలను తారుమారు చేస్తూ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్)... మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ రద్వాన్‌స్కా 6-2, 4-6, 6-3తో ప్రపంచ ఐదో ర్యాంకర్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. 26 ఏళ్ల రద్వాన్‌స్కా కెరీర్‌లో ఇది 17వ సింగిల్స్ టైటిల్. విజేతగా నిలిచిన ఈ పోలండ్ ప్లేయర్‌కు 18 లక్షల డాలర్ల (రూ. 11 కోట్లు) ప్రైజ్‌మనీ లభించింది. 1972లో మొదలైన ఈ టోర్నీ చరిత్రలో పోలండ్ క్రీడాకారిణికి టైటిల్ దక్కడం ఇదే తొలిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement