సంజూ శాంసన్
బెంగళూరు : ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా రాయల్‌చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 218 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. స్టార్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ 92(45 బంతులు, 2 ఫోర్లు, 10 సిక్సులు) వీరవిహారంతో రాజస్థాన్ భారీ స్కోర్ నమోదు చేసింది. ఇక ఈ సీజన్‌లో ఇప్పటికి ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. జట్టు స్కోర్ 49 వద్ద అజింక్యా రహానే 36(20 బంతుల్లో 6 ఫోర్లు,1 సిక్సు) క్రిస్ వోక్స్ బౌలింగ్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే డీఆర్సీ షార్ట్11(17 బంతుల్లో 1 ఫోర్) చహల్ బౌలింగ్‌లో కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి మరోసారి విఫలమయ్యాడు.
శాంసన్ విరవిహారం..
ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్, బెన్‌స్టోక్స్‌లు ఇన్నింగ్స్ చక్కదిద్దారు. జట్టు స్కోర్ 100 దాటిన అనంతరం బెన్ స్టోక్స్ చహల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ సాయంతో సంజూశాంసన్ రెచ్చిపోయాడు. 34 బంతుల్లో 5 సిక్సులతో శాంసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వేగంగా ఆడే ప్రయత్నంలో బట్లర్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక క్రీజులోకి వచ్చిన త్రిపాఠితో శాంసన్ వరుస సిక్సులతో బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చివర్లో త్రిపాఠి 14(5 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సు) సైతం దాటిగా ఆడటంతో రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 217 పరుగుల చేయగలిగింది. ఇక ఉమేశ్ వేసిన చివరి ఓవర్లో ఏకంగా రాజస్తాన్‌కు 27పరుగులు వచ్చాయి. ఆర్సీబీ బౌలర్లలో క్రిస్ వోక్స్, చహల్‌లకు రెండు వికెట్లు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment