రంజిత్‌కు మొండిచెయ్యి | Ranjith Maheshwari will not get Arjuna | Sakshi
Sakshi News home page

రంజిత్‌కు మొండిచెయ్యి

Published Fri, Sep 20 2013 1:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM

రంజిత్‌కు మొండిచెయ్యి

రంజిత్‌కు మొండిచెయ్యి

న్యూఢిల్లీ : డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రిపుల్ జంపర్ రంజిత్ మహేశ్వరికి... ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డును ఇచ్చేందుకు కేంద్ర క్రీడాశాఖ తిరస్కరించింది. 2008లో జరిగిన అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అతను నిషిద్ధ ఉత్ప్రేరకం ఎపిడ్రైన్ వాడినట్లు ఆరోపణలు వచ్చాయి.
 
  దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలన జరిపిన క్రీడాశాఖ చివరకు పై నిర్ణయానికి వచ్చింది. కొచ్చిలో సెప్టెంబర్ 8, 2008లో జరిగిన అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహేశ్వరి శాంపిల్స్‌ను సేకరించి వారం రోజుల తర్వాత జాతీయ డోప్ టెస్టింగ్ ల్యాబోరేటరి (ఎన్‌డీటీఎల్)లో పరీక్షించారు. తర్వాత అక్టోబర్ 3న జరిపిన ‘ఎ’ శాంపిల్స్ పరీక్షలో కూడా అతను ఎపిడ్రైన్ వాడినట్లు రుజువు కావడంతో సస్పెన్షన్ వేటు వేశారు.
 
 అయితే వైద్యపరమైన చికిత్స కోసం తాను ఎపిడ్రైన్ వాడానని శాంపిల్స్ సేకరణ సమయంలో మహేశ్వరి చెప్పకపోవడం, విచారణ కమిటీ ముందు ‘బి’ శాంపిల్‌ను పరీక్షించాలని కోరకపోవడంతో అతనిపై మూడు నెలల పాటు నిషేధం విధించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై మహేశ్వరి నిరసన తెలపకపోవడం, శిక్షను అంగీకరించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న క్రీడాశాఖ అవార్డును తిరస్కరించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన పూర్తి రికార్డులను భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) సమకూర్చలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కొత్త తరహా నిబంధనలు విధించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement