టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి
లండన్: ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు టీమిండియా సారథి విరాట్ కోహ్లి పూర్తి సిద్దంగా ఉన్నడని కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నారు. బ్రిటీష్ గడ్డపై తానేంటో నిరూపించుకోవాలని టీమిండియా సారథి తహతహలాడుతున్నాడని కోచ్ వివరించారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పిచ్‌లపై అదరగొట్టిన కోహ్లి.. ఇంగ్లడ్ పిచ్‌లపై కూడా రాణించి ప్రపంచ క్లాస్ బ్యాట్స్‌మన్‌గా నిరూపించుకుంటాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. గత సిరీస్ వైపల్యాలను చెరిపివేస్తూ జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌లో కోహ్లి బ్యాటింగ్ విధ్వంసం చూస్తామని అభిప్రాయపడ్డారు.
ఆఫ్ స్టంప్ బంతులతో ముప్పులేదు
2014లొ ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆఫ్ స్టంప్ బంతులకు కోహ్లి తీవ్రంగా ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అండర్సన్, బ్రాడ్‌లు పదేపదే అఫ్ స్టంప్ బంతులేస్తూ కోహ్లి సహనం కోల్పోయేలా చేసి వికెట్ సాధించారని పేర్కొన్నారు. అది గతమని ప్రస్తుతం అతడి ఆటలో ఎంతో పరిణితి చెందిందని, పరిస్థితులకు తగ్గట్టు ఆడటం కోహ్లికి అలవాటయిందని రవిశాస్త్రి వివరించారు. ఈ సిరీస్‌లో కోహ్లి నుంచి అద్వితీయమైన ఆటను చూడవచ్చని అభిప్రాయపడ్డారు.
ప్రపంచ శ్రేణి బ్యాట్స్‌మన్
‘2014లో జరిగిన టెస్టు సిరీస్‌కు విరాట్ కోహ్లి సాధారణ బ్యాట్స్‌మన్. ఆ సిరీస్‌లో విఫలమైన అనంతరం ఈ నాలుగేళ్లలో ఎంతగానో రాటు దేలాడు. ప్రస్తుతం అతడి రికార్డులు చూసి అర్థం చేసుకోవచ్చు. కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న కోహ్లి ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టాడు. ప్రపంచంలోనే కోహ్లి ఎందుకు అత్యుత్తమ బ్యాట్స్‌మనో బ్రిటీష్ ప్రజలకు తెలియనుంది’అని కోహ్లిపై రవిశాస్త్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment