రెండో టి20లో ఇంగ్లండ్ గెలుపు | The second T-20 in the win over England | Sakshi
Sakshi News home page

రెండో టి20లో ఇంగ్లండ్ గెలుపు

Published Sun, Sep 1 2013 1:30 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM

రెండో టి20లో ఇంగ్లండ్ గెలుపు

రెండో టి20లో ఇంగ్లండ్ గెలుపు

చెస్టర్ లీ స్ట్రీట్: తొలి మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు ఆరోన్ ఫించ్ కొట్టిన దెబ్బ నుంచి ఇంగ్లండ్ తొందరగానే కోలుకుంది. అలెక్స్ హేల్స్ (61 బంతుల్లో 94; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత బ్యాటింగ్‌తో రెండో టి20లో 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం అయ్యింది.
 
 రివర్‌సైడ్ మైదానంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... ఇంగ్లండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు చేసింది. ఓపెనర్లుగా వచ్చిన లంబ్ (27 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్సర్), హేల్స్ మెరుపు దాడితో ఆసీస్ బౌలర్లను బెంబేలెత్తారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 111 పరుగులు జోడించి జట్టుకు శుభారంభాన్నిచ్చారు. తర్వాత వచ్చిన రైట్ (18 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్సర్), మోర్గాన్ (11 బంతుల్లో 20; 2 సిక్సర్లు)లు కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది.
 
 ఆసీస్ బౌలర్లలో ఫవాద్ అహ్మద్ 3, ఫాల్క్‌నర్ 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 168 పరుగులు మాత్రమే చేసి ఓడింది. వార్నర్ (42 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. మాక్స్‌వెల్ (16 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్సర్), బెయిలీ (13 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్సర్) మినహా మిగతా వారు నిరాశపర్చారు. మార్ష్ (13), వార్నర్ మూడో వికెట్‌కు 67 పరుగులు జోడించినా ప్రయోజనం లేకపోయింది. డెర్న్‌బ్యాచ్ 3, బ్రిగ్స్ 2 వికెట్లు పడగొట్టారు. హేల్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం నుంచి ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement