డునెడిన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిం డీస్ ఫాలోఆన్‌లో పడింది. గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్లకు 168 పరుగులు చేసింది. డారెన్ బ్రేవో (72 బ్యాటింగ్), శామ్యూల్స్ (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం విండీస్ ఇంకా 228 పరుగులు వెనుకబడి ఉంది.
అంతకుముందు 67/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన విండీస్ టిమ్ సౌతీ (4/42), బౌల్ట్ (3/40) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 62.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్‌కు 396 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. చందర్‌పాల్ (76) మినహా మిగతా వారు విఫలమయ్యారు. అర్ధసెంచరీ సాధించిన చందర్‌పాల్ టెస్టుల్లో 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఏడో బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు.
విండీస్ ఫాలోఆన్
Published Fri, Dec 6 2013 1:23 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM
Advertisement
Advertisement