సీఎం బందోబస్తులో కానిస్టేబుల్ మృతి | constable killed in chandrababu tour due to heart attack | Sakshi
Sakshi News home page

సీఎం బందోబస్తులో కానిస్టేబుల్ మృతి

Published Sat, Nov 26 2016 12:17 PM | Last Updated on Tue, Mar 19 2019 5:56 PM

constable killed in chandrababu tour due to heart attack

కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా విధినిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ శాంతకుమార్(50) శనివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న శాంతకుమార్ వైఎస్సార్ జిల్లా కడపలో సీఎం పర్యటన సందర్బంగా బందోబస్తు విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం కడప మార్కెట్ యార్డులో డ్యూటీ చేస్తూ గుండె నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి పోలీసులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతను తుది శ్వాస విడిచాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement