ధనుష్, కిమ్‌కర్దా షియాన్‌తో ఫర్‌అడల్ట్స్‌ఓన్లీ | Dhanush to pair up with Kim Kardashian? | Sakshi
Sakshi News home page

ధనుష్, కిమ్‌కర్దా షియాన్‌తో ఫర్‌అడల్ట్స్‌ఓన్లీ

Published Sat, Jun 20 2015 2:31 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ధనుష్, కిమ్‌కర్దా షియాన్‌తో ఫర్‌అడల్ట్స్‌ఓన్లీ - Sakshi

ధనుష్, కిమ్‌కర్దా షియాన్‌తో ఫర్‌అడల్ట్స్‌ఓన్లీ

ఫర్ అడల్డ్స్ ఓన్లీ ఇది టైటిల్ అయితే ఆ చిత్రం ఎలా ఉంటుందో నన్న ఊహాగానాలకు ఆస్కారం ఉంటుంది. అంతేకాదు ఆ చిత్రంపై అమితాసక్తి కలుగుతుంది. అదే గనుక జరిగితే ఆ చిత్రానికి కాసుల వర్షమే. మరి అలాంటి చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కితే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తాయి. ఈ చిత్రంలో దక్షిణాది సూపర్‌స్టార్ ధనుష్ హీరో (కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పుడాయన్ని ఇలానే పిలుస్తున్నారు) అయితే షమితాబ్ చిత్రం తరువాత ధనుష్ ఇమేజ్ బాలీవుడ్‌లోను బాగానే పెరిగింది. ఇప్పుడాయనికి అక్కడ పలు అవకాశాలు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ధనుష్ తొలి బాలీవుడ్ చిత్రం రంజానా విజయాన్ని అందుకుంది.
 
  ఇలా తమిళంతో పాటు, హిందీలోనూ విజయబావుటా ఎగురవేస్తున్న స్టార్ హీరో ధనుష్‌తో బాలీవుడ్ దర్శకుడు పైసల్ సైఫ్ హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఫర్ అడల్ట్స్ ఓన్లీ అనే చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారన్నది తాజా సమాచారం. ఇందులో ఆయనకు జంటగా సంచలన నటి కిమ్ కర్దా షియాన్ నటించనున్నట్లు తెలిసింది. అమెరికాకు చెందిన డిమెన్షన్ ఫిలింస్ సంస్థ నిర్మించనున్న ఈ త్రిభాషా చిత్రం కొన్ని నెలల్లో సెట్‌పై వెళ్లే అవకాశం ఉందన్నది కోలీవుడ్ టాక్. చిత్ర టైటిల్ చూస్తుంటే ఇదేదో సంచలన కథా చిత్రం అయ్యి ఉంటుందనిపిస్తోంది కదూ. పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement