దీంతో జీవితంపై విరక్తి చెందిన ప్రేమికులు మంగళవారం ఉదయం ఇంట్లో నుంచి పారిపోయారు. బుధవారం వడమధురై సమీపంలోని అడవిలో చెట్టుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పశువుల మేతకు వెళ్లిన వారు విషయాన్ని గ్రామంలో చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంగల్ సీఐ కుమార్, ఎస్‌ఐ సత్యభామ సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట
Published Wed, Sep 20 2017 10:26 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM
తమిళనాడు: తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట అత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన తమిళనాడులోని పెరియపాళెంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఎల్లాపురం యూనియన్ చిన్నిసెంగత్తాకుళంకు చెందిన అంగన్ కుమార్తె పవిత్ర (17) పెరియపాళెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. అదేగ్రామానికి చెందిన రవి కుమారుడు సురేష్(19) లారీ క్లీనర్. వీరిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు పవిత్రను మందలించారు.

Advertisement
Advertisement