తెలుగు ప్రజలున్న ప్రతి గడపకూ వెళ్లండి | Telugu people go to every door Coupe | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలున్న ప్రతి గడపకూ వెళ్లండి

Published Wed, Jul 13 2016 1:53 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

తెలుగు ప్రజలున్న  ప్రతి గడపకూ వెళ్లండి - Sakshi

తెలుగు ప్రజలున్న ప్రతి గడపకూ వెళ్లండి

బెంగళూరు : బెంగళూరు నగరంలో తెలుగు ప్రజలు ఉన్న ప్రతి గడపకు వెళ్లి ‘గడప గడపకూ వైఎస్‌ఆర్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, యువనేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు సూచించారు. బెంగళూరుకు చెందిన ప్రవాసాంధ్రులు ఉపేంద్రరెడ్డి, మహేంద్రరెడ్డిలు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో యువనేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని మంగళవారం కలిశారు.

ఈ సందర్భంగా బెంగళూరులో తాము నిర్వహించనున్న ‘గడప గడపకూ వైఎస్‌ఆర్’ కార్యక్రమాన్ని గురించి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డికి వివరించినట్లు ఉపేంద్ర రెడ్డి తెలిపారు. నగరంలోని యలహంక నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఉపేంద్ర రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement