ఆ ఫోన్‌కు జియో 100జీబీ ఉచిత డేటా | Reliance Jio Users Buying Xiaomi Mi Max 2 Will Get Up to 100GB Free Data | Sakshi
Sakshi News home page

ఆ ఫోన్‌కు జియో 100జీబీ ఉచిత డేటా

Published Tue, Jul 18 2017 8:05 PM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM

ఆ ఫోన్‌కు జియో 100జీబీ ఉచిత డేటా

ఆ ఫోన్‌కు జియో 100జీబీ ఉచిత డేటా

షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఎంఐ మ్యాక్స్‌2 కొనుగోలుచేయాలని ఎవరైనా జియో యూజర్లు ప్లాన్‌ చేస్తున్నారా? అయితే వారికోసం రిలయన్స్‌ జియో ఓ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసిన వారికి 100జీబీ వరకు 4జీ డేటాను ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది. రిలయన్స్‌ జియో, షావోమి భాగస్వామ్యంలో లాంచ్‌ ఆఫర్లలో భాగంగా దీన్ని తీసుకొస్తున్నట్టు తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి ప్రవేశించిన జియో ఇప్పటికే టెలికాం ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసిన సంగతి తెలిసిందే. 
 
ఎంఐ మ్యాక్స్‌ 2 మంగళవారం భాతర మార్కెట్‌లోకి లాంచైంది. దీని ధర 16,999 రూపాయలు. 6.44 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌, 4జీబీ ర్యామ్‌, 5300 ఎంఏహెచ్‌ బ్యాటరీ దీనిలో ప్రత్యేక ఫీచర్లు. జియో-ఎంఐ మ్యాక్స్‌ 2 ఆఫర్‌ 4జీ డేటా అందుబాటులో ఉన్న అన్ని రీఛార్జ్‌లకు, ఎస్‌ఎంఎస్‌లకు, సబ్‌స్క్రిప్షన్‌ చేసుకున్న జియో యాప్స్‌కు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులు రూ.309, అంతకంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జ్‌ చేసుకుంటే, ప్రతి 28 రోజుల వ్యవధికి 10జీబీ 4జీ డేటా అదనంగా పొందుతారు. 10 రీఛార్జ్‌లకు ఇది అందుబాటులో ఉంటుంది. ఇలా 2018 మార్చి వరకు ప్రతి నెలా 10జీబీ అదనపు డేటాతో మొత్తం 100జీబీ డేటాను ఈ కస్టమర్లు పొందనున్నారు.  
 
ఉదాహరణకు... ఎంఐ మ్యాక్స్‌ 2ను కొనుగోలుచేసిన జియో కస్టమర్లు రూ.309తో రీఛార్జ్‌ చేసుకున్నారనుకోండి. ప్లాన్‌లో భాగంగా 56 రోజుల పాటు 56జీబీ పొందుతారు. దీంతో పాటు తొలి 28 రోజులకు 10జీబీ డేటా, మరో 28 రోజులకు 10జీబీ డేటా పొందుతారు. ఈ రీఛార్జ్‌ ప్యాక్‌ వాలిడిటీ అయిపోయ్యాక, మరోసారి రూ.309తో రీఛార్జ్‌ చేసుకుంటే, 56జీబీ+10జీబీ+10జీబీ మరో 56 రోజులు అందుబాటులోకి వస్తోంది. ఇలా ప్రతినెలా 10జీబీ డేటాను కస్టమర్లు పొందుతారు. ప్రస్తుతం జియో, షావోమి పార్టనర్‌షిప్‌లో ప్రకటించిన 100జీబీ డేటా వాల్యు చాలా ఎక్కువని తెలిసింది. అంతకముందు షావోమి ఫోన్లపై జియో 30జీబీ వరకు డేటా ఆఫర్‌చేసింది. ప్రస్తుతం ఎంపికచేసిన ఆసుస్‌ స్మార్ట్‌ఫోన్లకు మాత్రమే జియో 100జీబీ వరకు డేటాను అందిస్తోంది. జియోనితో కూడా జియోకు భాగస్వామ్యం ఉంది. ఇక తన బ్రాండు ఎల్‌వైఫ్‌ మొబైళ్లు కొనుగోలుచేసిన వారికి 20 శాతం అత్యధిక డేటా ఇస్తోంది.  కొత్త జియోఫై పాకెట్‌ రూటర్‌ కొనుగోలుచేసిన వారికీ కూడా 224జీబీ వరకు ఉచిత డేటా ఆఫర్‌ చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement